Bapu gari Pelli Pustakam

Bapu gari Pelli Pustakam

On the eve of Pelli Pustakam Anniversary here is a small article on the movie.

1 year ago | By Harsha Pagilla

శ్రీరస్తు.. శుభమస్తు... !! (4)
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం (2)
శ్రీరస్తు.. శుభమస్తు... !! (2)

ఏ పెళ్ళికి వెళ్ళినా ఆ పెళ్ళిలో వినిపించే పాట ఇది. పెళ్లిపుస్తకం సినిమా కొత్తగా పెళ్లి చేసుకునే ప్రతి ఒక్క జంట తప్పక చూడాల్సిన చిత్రం. పెళ్లి తర్వాత ఉండే కష్టాలు, ఒడిదొడుకులు ఎన్ని వచ్చిన వారి మధ్య ఉండే ప్రేమ వీటన్నిటిని ఎలా ఎదురుకుంటుంది అనే సారాంశమే ఈ చిత్రం.

బాపు గారి సృష్టి, ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటలు, కే వి మహదేవన్ గారి సంగీతం, ఆరుద్ర గారి పాటలు, రాజేంద్రప్రసాద్,దివ్యవాణిల నటన ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి ఈ చిత్రం గురించి మాట్లాడాలంటే.

కథ: కొత్తగా పెళ్లి అయిన ఒక జంట తమ ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడటానికి ఒక పెద్ద కంపెనీలో తమకి పెళ్లి అవ్వలేదని చెప్పి జాయిన్ అవుతారు. ఆ అబద్దం వళ్ళ వచ్చిన అనర్ధలేంటి అనేదే పెళ్లి పుస్తకం.

బాపు - వేంకటరమణ: ఈ ఇద్దరి మైత్రి గురించి మనం ప్రేత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళ కలయికలో వచ్చిన ఎన్నో ఆణిముత్యాలలో పెళ్లి పుస్తకం ఒకటి. ఒక అందమైన కావ్యంలా దీనిని తీర్చిదిద్దారు. రాజేంద్రప్రసాద్ గారి కామెడీ టైమింగ్ తో పాటు దివ్యవాణి అందాన్ని ఎంతో చక్కగా చూపించారు. పెళ్లంటే ఒక భారం కాదు బాధ్యత అని ఒక మంచి మెసేజ్ ని మనకందించారు. వారిద్దరూ మనతో లేకపోయినా వాళ్లు మనకందించిన ఈ కావ్యంలో వారిని మనం చూసుకోవచ్చు.

ఏప్రిల్ 1 1991 న రిలీజ్ అయిన పెళ్లి పుస్తకం బాక్సాఫీస్ లో సూపర్ హిట్ గా నిలిచిపోయింది. అది మాత్రమే కాకుండా ఉత్తమ చిత్రంగా నంది కుడా వరించింది. ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో కుడా దీనిని ప్రదర్శించారు. ఇన్ని గొప్ప సంగతులున్న ఈ పెళ్లి పుస్తకం 28 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన మరొక్కసారి గుర్తు చేస్కుంటూ

Happy 28th Anniversary of Pelli Pustakam.

Written By: Harsha Pagilla


0 Likes Comments Share

Sponsored Ads

Note: 9by10.com takes no responsibility for the content or accuracy of the above news articles. The news articles and posts do not represent 9by10's opinions nor can we guarantee that the reporting therein is completely factual. Please visit the source responsible for the item in question to report any concerns you may have regarding content or accuracy.

Sponsored Ads

Sponsored Ads