Oka Window Katha - Part 1

Oka Window Katha - Part 1

ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు నన్ను.

1 year ago | By Harsha Pagilla

ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు నన్ను. మనిషి ప్రకృతికి భయపడి నాలుగు గోడలతో ఇల్లు అని ఒకటి నిర్మించుకున్నాడు బందీలాగ బ్రతుకుతున్నాడు. మళ్లీ అదే బందిఖానాలో నుండి ప్రకృతి అందాన్ని చూడటానికి కిటికీ అని నన్ను నిర్మించాడు. నన్ను తయారు చేసాడు గనుక మనిషే నా దేవుడు. జన్మనిచ్చాడు కాబట్టి అతనికి ఎన్ని విదాలుగైనా సాయపడాలని పుట్టిన నాడే ఒట్టుపెట్టుకున్నాను. మమల్ని ఎన్నో విధాలుగా వాడుతున్నాడు. చివరికి మోటారు వాహనాలలో కుడా. నన్ను కుడా ఆ మోటారు వాహనాలలో ఒకటైన బస్సుకి అమర్చాడు. అక్కడ నాకు ఎంతో మంది సహచర విండోలతో స్నేహం కుదిరింది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావ్ నువ్వు అని అడగాలని మీకు అనిపించి ఉంటుంది ఈ పాటికే. కథలోకి  వెళ్లాలంటే ముందు కథానాయకుడి గురించి చెప్పాలి కదా! అందుకే ఇంత  సేపు నా గురించి చెప్పను. అవును ఈ కథలో కథానాయకుడిని నేనే. ఇక కథలోకి వెళ్దాం, ఇది నా ప్రేమ కథ.


ఒక కిటికీవి నీకు ప్రేమేంటని తీసిపారెయ్యకండి. అందమైన ప్రకృతిని చూపించే ముందు ఆ అందాన్ని నేను కుడా ఫీల్ అయితేనే కదా మీకు చూపించగలను. ఒకసారి నేను చెప్పేది వినండి అప్పటికి మీ ఉద్దేశం మారకపోతే మిరే కరెక్ట్ అని ఒప్పుకుంట.


అది నేను కొత్తగా డ్యూటీ జాయిన్ అయిన రోజులు. ముందు మా బస్సు బాబాయిని ఆర్టీసీ వాళ్లు కొని వాడారు. నన్ను చివరి సీట్లు ఉండే చోట అమర్చారు. ఈ ఆర్టీసీ వాళ్ళ పుణ్యమా అని ఒక్క ఆడవాసన కుడా లేకుండా పోయింది. నా బతుక్కి రూల్ ఒకటి పెట్టి చచ్చారుగా స్త్రీలు ముందు సీట్లోనే అని. ఇలా కొన్ని  రోజు నా దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఉండగా మా టైరు తాతయ్య ఒక శుభవార్త పట్టుకొచ్చాడు. ఆ వార్త వినగానే ఎగిరి గంతెయ్యాలన్న సంతోషానికి గురయ్యాను. కానీ ఆలా వేస్తే పగిలి ముక్కలవుతానని ఆవేశాన్ని ఆపుకున్నాను. అదేంటంటే మా బస్సుని ఆర్టీసీ వాళ్ళు ఒక ఉమెన్స్ కాలేజీకి అమ్మేస్తున్నారని. మాక్కూడా మంచి రోజులు వచ్చాయని మా చివరి సీటు విండోలందరం సంబరపడ్డాం.  ఆ రోజు ఎప్పుడొస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాం.


ఆ అందమైన రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయం ఆరు గంటలకే మా డ్రైవర్ మామయ్యా వచ్చి మా అందరికి షాంపూతో స్నానం చేయించి కొత్తగా అద్దంలా తయారు చేసాడు. తర్వాత ఇంజిన్ స్టార్ట్ చేసి ముందుగా ఎల్బీనగర్ బస్ స్టాప్ దెగ్గర ఆపాడు. అక్కడి నుండి మా ప్రయాణం మొదలైంది మెల్లగా ముందు సీట్లు అన్ని నిందుతు వస్తున్నాయి. మాకు అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాం. మనం ఒకటి తలిస్తే దేవుడు  అన్నట్టు అన్ని సెట్లు నిండిపోయాయి కానీ నా చివరి సీటు మాత్రం కాలిగానే ఉండిపోయింది. అప్పటి దాకా ముక్కోటి దేవుళ్ళకి మొక్కిన నేను తిట్టడం మొదలెట్టాను. నా తిట్లకి తట్టుకోలేడు కాబోలు సడన్గా డ్రైవర్ బ్రేక్ కొట్టాడు.ఏంటా అని బయటకి చూసాను, ఒక తెల్లటి ఆకారం మా వైపు పరిగెత్తుకుంటూ వస్తోంది. మంచు వాళ్ళ నా కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు. ఉమెన్స్ కాలేజీ బస్సు కాబట్టి వచ్చేది అమ్మాయి అని అనుకున్నాను. అలా ఒక గంట ప్రయాణం తర్వాత బస్సు కాలేజీ ముంది ఆగింది. బస్సులో ఉన్న అందరితో పాటు తాను కుడా దిగి నడుచుకుంటూ లోపలి వెళ్లిపోయింది. నా కొలీగ్స్ పిచ్చాపాటిగా మాట్లాడుకోడం మొదలెట్టారు. నేను వాళ్ల మాటలు వింటున్నాను.


వి1: మామ ఈరోజు నా పక్కన ఒక పాప కూర్చుంది. ఎంత అందంగా ఉందంటే, తను మనలా అద్దం అయ్యుంటే ఈపాటికి ఒక అద్దాల  షాపు పెట్టుకునేంత పిల్లల్ని కనేవాన్ని.


వి2: చాల్లే ఆపారా నీ పక్కన కంటే మన సిద్దూ గాడి పక్కన కూర్చున్న పాప గ్లాసు పగిలేలా ఉంది.


గ్లాసు పగిలేలా అంటే అంటే మతిపోయేలా ఉంది అని మావాడి అర్ధం. ఇంతకీ ఆ సిద్దూ ఎవరో కాదు నేనే. నా పక్కన అంత అందమైన అమ్మాయి కూర్చుందని నాకే తెలియదు.


సిద్దూ: అవునా బావా? నేను అసలు చూడనే లేదు ఆ అమ్మాయిని. నా కాళ్ళని ఆ పాడుమంచు కప్పేసింది.


వి2: దురదృష్టం అని నీదేరా బావా. రాక రాక లక్ష్మిదేవి ఇంటి తలుపు తడితే చిల్లర లేవు రేపురా అన్నాడట నీలాంటోడే.


సిద్దూ: సర్లే ఎన్ని అనుకోని ఏం లాభం, నా కర్మ అలా ఏడ్చింది.


వి2: ఆలా నిరుత్సాహ పడకురా మళ్ళి వచ్చి నీ పక్కనే కుర్చుంటుందిలే.


వాడన్న మాట నిజమైతే బాగుండు అని పోతున్న తిట్టినా తిట్లు వెనక్కి తీసుకుంటూ దేవుణ్ణి ఇదొక్క సాయం చెయ్యమని వేడుకున్నాను. సాయంత్రం 6  అవ్వగానే అమ్మాయిలు కాలేజీ నుండి బయటకి వస్తున్నారు. మళ్ళీ ముందు సీట్లు అన్నీ నిండిపోయాయి. సరిగ్గా బస్సు కదిలే సమయానికి ఒక తెల్ల చుడిదార్ బస్సు వైపు పరిగెత్తుకుంటూ వచ్చి నా సీట్లో కూర్చుంది. నా కొలీగ్స్ సైగల బట్టి పోతున్న అమ్మాయి తనే అని అర్థమైంది. నేనిక తన మొహాన్ని చూడలేదు. చూడాలంటే సిగ్గేసింది. ఒక కిటికీ అయ్యుండి నేను సిగ్గుపడటం ఏంటని తన వైపు చూసాను.


పొద్దున్న మా వాళ్లు చెప్తుంటే ఆడ వాసన తాగాలని అద్దాలు రాయికి చీర కట్టినా రంభలా ఉందని అంటరాని నమ్మలేదు.  కానీ వాళ్లు  చెప్పింది నిజం అని ఇప్పుడు అర్ధమైంది. మేలిమి ఛాయ రంగు, శంఖం లాంటి చెవులకి తోరణలాంటి జుంకీలు. నక్షత్రలాంటి కళ్ళు, వాటికి చీకటిలా అడ్డుకట్ట వేసినట్టుగా కాటుక. ఎర్రని గులాబీలాంటి పెదవులు వాటి వెనకాల ముత్యాలాంటి పళ్లు. ఆమె గురించి వర్ణిస్తుంటే నాలోని కవి బయటకి వస్తున్నాడు.


బస్సు ఎక్కిన దెగ్గరినుండి తననే చూస్తూ ఉండిపోయాను, కానీ తాను మాత్రం పుస్తకాలలో లీనమైపోయింది. ఒక గంట ప్రయాణం తర్వాత తాను దిగిపోయింది. తాను దిగి వెళ్తుంటే ఎదో తెలియని బాధ, మళ్ళి రేపు వస్తుంది అని ఆనందం, వచ్చి నా పక్కన కూర్చోదేమో అనే భయం ఒకేసారి అనుభవించాను. ఆ రాత్రంతా తెలిసిన దేవుడికల్లా మొక్కుతూ ఉండిపోయాను.


To be Continued...

Written By: Harsha Pagilla


1 Likes Comments Share

Sponsored Ads

Note: 9by10.com takes no responsibility for the content or accuracy of the above news articles. The news articles and posts do not represent 9by10's opinions nor can we guarantee that the reporting therein is completely factual. Please visit the source responsible for the item in question to report any concerns you may have regarding content or accuracy.

Sponsored Ads

Sponsored Ads