Oka Window Katha - Part 2

Oka Window Katha - Part 2

తెల్లారే కోడికన్నా ముందే నిద్ర లేచాను. ఆ రోజేంటో అన్ని శుభసూచకాలే

1 year ago | By Harsha Pagilla

తెల్లారే కోడికన్నా ముందే నిద్ర లేచాను. ఆ రోజేంటో అన్ని శుభసూచకాలే కనబడ్డాయి. రాత్రి డ్రైవర్ మా మీద గుడ్డ కప్పడం వాళ్ల మంచు నా మీద లేదు. మళ్లి రోజులాగే బస్సు బయలుదేరింది. సడన్గా నా ఆశలన్నీ ఆడియాశలు చేస్తూ, నా పక్కన ఒక చిన్న సైజు ఏనుగులా ఉన్న ఒక అమ్మాయి కూర్చుంది. తను కూర్చోగానే మా సీటు బాబాయికి సీటు పగిలే అంత పనైంది. నాకేం చెయ్యాలో అర్థంకాలేదు, అరిచి గోల చేద్దాం అనుకున్నాను కానీ మా రూల్స్ బ్రేక్ చేసినట్టు అవుతుందని ఆగిపోయాను. తను వచ్చే  బస్ స్టాప్ దెగ్గరికొచ్చింది. నా గ్లాజు గుండే గట్టిగా కొట్టుకుంటోంది, సరిగ్గా తన స్టాప్ రాగానే ఆ భారీకాయం దిగిపోయి తను రావడం ఒక లీలగా గుర్తుంది. తను ఎప్పటిలాగే మౌనంగా పుస్తకంలో చూస్తోంది, నేను తనని చూస్తూ ఉండిపోయాను.


ఇలా రోజులు గడిచిపోతున్నాయి, మధ్య మధ్యలో తను నన్ను తాకడం (అంటే విండో క్లోజ్ చేసేటప్పుడు) ఆ స్పర్శ నా జీవితానికి చాలనిపించింది. రోజు రోజుకి తన మీద ఇష్టం ప్రేమగా మారిపోతోంది. తను ఒక్కరోజు కాలేజీకి రాకపోతే ఆ రోజంతా మౌనంగా ఉండిపోయాను.


అంతా బానే ఉంది కానీ తాను బస్సులో ఎవరితోను ఒక్క మాట కుడా మాట్లాడేది కాదు. నెమ్మదస్తురాలేమో అనుకున్నాను కానీ ఒక రోజు తనతో పాటు ఇంకొక అమ్మాయి కుడా వచ్చింది. ఇద్దరు పక్క పక్కన కూర్చోని ఏవేవో సైగలు చేసుకుంటున్నారు, మొదట్లో నాకేం అర్ధంకాలేదు కానీ తర్వాత అర్ధమైంది తను మాట్లాడలేదు అని. దేవుడు మనుషుల జీవితాలతో అడే ఆటని చూసి నువ్వుకున్నాను. అందరికి అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి ఆనందించేలోపు ఎదో ఒకటి లాగేసుకుంటాడు. ఆ లోపంతో తనంటే ఇంకా ఎక్కువ ప్రేమ మొదలైంది. ఒక్కసారైనా తనని నా అంతటా నేను తాకాలనుకున్నాను. ఆ విషయం తెలిసి నా కలీగ్స్ నన్ను అవహేళన చేసారు. 


వి1: ఏంటి బావ ఈ మద్య బొద్దిగా మాట్లాడటం లేదు. 


వి2: వాడు మనతో ఎందుకు మాట్లాడుతాడ్రా పక్కన అమ్మాయి ఉంటే ఇక మనం ఎందుకు?


వి1: అవునా సర్లే చుస్తే చూసావుగాని ప్రేమ గీమా లాంటివి పెట్టుకోకు. 


సిద్దు: ఎందుకు పెట్టుకోకూడదు, ఏం నేను ప్రేమించకూడదు?


వి1: ప్రేమించొచ్చు ఏ అద్దాన్నో కిటికినో కానీ మనిషిని కాదు. ఒక విండో అయ్యుండి మనిషితో ప్రేమేంటయ్యా? అయినా మన రూల్స్ తెలుసుకదా ఏం జరిగినా ఎట్టి పరిస్థితిలో మనుషులతో మాట్లాడకూడదు. ఇన్ని సంవత్సరాలు మౌనంగా ఉండి ఇప్పుడు మాట్లాడితే జనాలు గూండాగి చస్తారు. 


వాళ్లు అన్నదాంట్లో కుడా నిజం ఉందిలేండి కానీ నాక్కూడా ఒక మనసుంటుందని తనని చూసాకే తెలిసింది. 


ఆ రోజు ఆదివారం కాలేజీలో చివరి రోజు ఈ బస్సు బాలేదు అమ్మేస్తున్నామని డ్రైవెర్ తో చెప్తుంటే విన్నాను. నాకేం చెయ్యాలో అర్థంకాలేదు. రేపటి నుండి తనని చూడలేనన్న ఊహే భయంకరంగా ఉంది. అలాంటిది. 


తను ఎప్పటిలాగే సాయంత్రం వచ్చి నా పక్కన కూర్చుంది. పరీక్ష పేపర్ అనుకుంటా దీర్ఘంగా దానివైపే చూస్తోంది. బస్సు అప్పుడే దిల్ శుక్ నగర్  వచ్చింది. జనాల రద్దీతో ట్రాఫిక్ ఆగిపోయింది. ఇంకో పది నిమిషాలలో తను నా నుండి దూరమైపోతోంది, ఇక చెప్పేద్దాం అనుకున్నాను. కానీ దైర్యం సరిపోడంలేదు, ఇలా కాదని కళ్లుమూసుకుని చెప్పేద్దామని కళ్లు మూసుకున్నాను. 


సడన్గా ఒక పెద్ద శబ్దంతో ఎదో వచ్చి నన్ను బలంగా తాకింది. నా శరీరమంతా మొత్తం బయటకు వచ్చింది, కళ్లు తెరిచాను. 


నేను పన్నెండు నెలల నుండి ఎవరినైతే తాకాలి అనుకున్నానో, ఎవరి కోసం అయితే నేను రోజు ఎదురుచూస్తున్నానో, తనని తాకేలా చేసింది ఆ శబ్దం. ఆ పేలుడితో నా గాజు ముక్కలుగా పగిలి తన గుండెకి తాకాయి. తన శరీరం అంత రక్తంతో తడిసిపోయింది. తన ఊపిరి ఆగిపోయింది. 


ప్రపంచంలో ఏ ప్రేమికుడికి లేనంత దురదృష్టం నాకుంది, ప్రేయసిని తాకిన వెంటనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది. 


దిల్ శుక్ నగర్ బాంబు పేలుళ్లలో కావాల్సిన వాళ్లని కోల్పోయిన వాళ్లలో నేనొకడిని. మా బస్సు మొత్తం పేలుళ్లలో పనికిరాకుండా పోయింది. నా ఊపిరి కుడా ఆగిపోయేలా ఉంది. అది ఆగేలోపు నా బాధని పంచుకోవాలని ఇది చెప్తున్నాను. 


The End.

Written By: Harsha Pagilla


0 Likes Comments Share

Sponsored Ads

Note: 9by10.com takes no responsibility for the content or accuracy of the above news articles. The news articles and posts do not represent 9by10's opinions nor can we guarantee that the reporting therein is completely factual. Please visit the source responsible for the item in question to report any concerns you may have regarding content or accuracy.

Sponsored Ads

Sponsored Ads